నేను ఇంకా బ్రతికే ఉన్నాను.. సమంత ఎమోషనల్!
on Nov 8, 2022

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో తాను బాధపడుతున్నట్టు ఇటీవల హీరోయిన్ సమంత ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కొందరైతే ఆమెకు ప్రాణాపాయమని కూడా రాసుకొచ్చారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై తాజాగా స్పందించిన సమంత కన్నీళ్లు పెట్టుకుంది.
సమంత టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'యశోద' నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. చేతికి సెలైన్ పెట్టుకొని మరీ ఈ చిత్ర డబ్బింగ్ పూర్తి చేసింది సమంత. ఈ సందర్భంగా తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. తాను మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు తెలిపింది. ఇక అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొండడం కూడా కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే అనారోగ్యంతో సినిమా డబ్బింగ్ పూర్తి చేసి ఎందరో ప్రశంసలు అందుకున్న సమంత.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
'యశోద' ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఎమోషనల్ అయింది. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కొందరు తన అనారోగ్యం గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇంకా బ్రతికే ఉన్నానని, త్వరలో చావట్లేదని, ప్రాణహాని లాంటి హెడ్డింగ్స్ తో న్యూస్ రాయడం అవసరం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. తనలాగే ఎందరో కష్టాలతో పోరాడుతున్నారని, తాను కూడా ఈ సమస్యపై పోరాడి విజయం సాధిస్తానని సమంత చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



