యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ దాటిన 'యశోద'
on Nov 16, 2022
సమంత టైటిల్ రోల్ పోషించిన 'యశోద' నవంబర్ 11న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టాక్ కి తగ్గట్టే మొదటి వీకెండ్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. నాలుగో రోజైన సోమవారం నుంచి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించినా ఓవరాల్ గా మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్లే వస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ లో మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది.
యూఎస్ లో 'యశోద'కు మంచి ఆదరణ లభిస్తోంది. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ మార్క్ అందుకుంది. యూఎస్ లో ఇప్పటిదాకా 5 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ దిశగా పయనిస్తోంది. గతంలో సమంత నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్'ఓ బేబీ' యూఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకుంది. ఇప్పుడు 'యశోద' కూడా ఆ ఫీట్ సాధిస్తుందేమో చూడాలి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో రూ.6.02 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ.. తమిళనాడులో రూ.80 లక్షల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.95 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.2.30 కోట్ల షేర్ తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.10.07 కోట్ల షేర్ రాబట్టినట్టు అంచనా. 'యశోద' ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ రూ.12 కోట్లని తెలుస్తోంది.