సోదరా అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన మోహన్ బాబు
on Nov 15, 2022

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. మహేష్ బాబుకి, ఇతర కుటుంబసభ్యులకి ధైర్యం చెప్పి.. కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక మోహన్ బాబు అయితే కృష్ణ భౌతికకాయాన్ని చూసి సోదరా అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు.
కృష్ణతో మోహన్ బాబుకి ఎంతో అనుబంధముంది. కృష్ణ హీరోగా నటించిన కొన్ని సినిమాలకు మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. నటుడిగా మారాక దాదాపు 70 సినిమాల్లో కృష్ణకి విలన్ గా నటించారు. మోహన్ బాబుని కృష్ణ 'భక్త'(మోహన్ బాబు అసలు భక్తవత్సలం నాయుడు) అని పిలిచేవారు. తన కెరీర్ ప్రారంభంలో కృష్ణ గారు ఎంతో ప్రోత్సహించారని మోహన్ బాబు చెప్పారు.
కృష్ణతో ఎంతో అనుబంధమున్న మోహన్ బాబు.. ఆయన మృతదేహాన్ని చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయారు. సోదరా సోదరా అంటూ విలపించారు. మహేష్ ని హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



