'యశోద' ట్రైలర్.. 'సరోగసి' కాన్సెప్ట్ తో సమంత!
on Oct 27, 2022
.webp)
సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం 'యశోద'. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఐదు భాషల్లో ఐదుగురు హీరోల చేతుల మీదుగా 'యశోద' ట్రైలర్ విడుదలైంది. తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళ్ లో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా వస్తున్న 'యశోద' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది సరోగసి(అద్దె గర్భం) నేపథ్యంలో రూపొందించిన చిత్రమని అర్థమవుతుంది. డబ్బు అవసరమవ్వడంతో సమంతతో పాటు కొందరు స్త్రీలు సరోగసికి(ధనవంతుల బిడ్డల్ని తమ కడుపులో మోయడానికి) అంగీకరించి.. ఒక స్పెషల్ కేర్ సెంటర్ కి వెళ్తారు. అయితే అక్కడ వారికి అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. సరోగసి ముసుగులో అక్కడ ఏం జరుగుతుంది? దాని వెనక ఎవరున్నారు? వంటి ప్రశ్నలతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి ప్రధాన బలంగా నిలిచింది.
ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, సంపత్ రాజ్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఎం.సుకుమార్, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



