'ఆదిపురుష్'.. ఫ్యాన్స్ ని భయపెడుతున్న మరో న్యూస్!
on Oct 28, 2022

టీజర్ విడుదల కాకముందు వరకు రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న 'ఆదిపురుష్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే టీజర్ విడుదలైందో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా నిరాశ చెందారు. పాత్రలు వేషధారణ, వీఎఫ్ఎక్స్ బాలేదని కామెంట్స్ వినిపించాయి. అయితే తాము దీనిని మొబైల్ స్క్రీన్ కోసం రూపొందించలేదని, బిగ్ స్క్రీన్ కోసం రూపొందించామని మూవీ టీమ్ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఈ సినిమా పట్ల కాస్త ఆందోళన నెలకొని ఉంది. ఇక తాజాగా వినిపిస్తున్న న్యూస్ వారి ఆందోళనను రెట్టింపు చేసేలా ఉంది.
ఒకప్పటిలా ఎక్కువ నిడివి ఉన్న సినిమాలు చూసే రోజులు కావివి. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోతే ఆడియన్స్ బోర్ గా ఫీలవుతున్నారు. ఇక మూడు గంటల సినిమా అంటే ప్రతి సీన్ ఆసక్తికరంగా ప్రేక్షకులను తల తిప్పనివ్వకుండా చేయలగాలి. అలాంటిది 'ఆదిపురుష్' ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. రెండు నిమిషాలు కూడా లేని టీజర్ చూసే ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటిది ఈ సినిమాతో ప్రేక్షకులను థియేటర్లలో మూడు గంటలకు పైగా కూర్చోబెట్టగలరా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. మరి 'ఆదిపురుష్'తోనైనా ప్రభాస్ వారిని అలరిస్తాడేమో చూడాలి.
టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనువిందు చేయనున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023, జనవరి 12న విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



