రాకీ భాయ్ కొత్త సినిమా అప్డేట్!
on Dec 20, 2022

'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 'కేజీఎఫ్ చాప్టర్-2' వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్నా ఇంతవరకు ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించకపోవడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఫ్యాన్స్ ఖుషి అయ్యే న్యూస్ వినిపిస్తోంది. యశ్ కొత్త సినిమా ప్రకటనకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.
ఏప్రిల్ 14న విడుదలైన 'కేజీఎఫ్-2' సంచలన విజయాన్ని అందుకొని ఈ ఏడాది ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. యశ్ కి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ క్రేజ్ ని నిలబెట్టుకోవడానికి యశ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఆలస్యమైనా పర్లేదు తన తదుపరి సినిమాలు 'కేజీఎఫ్' స్థాయికి తగ్గకుండా ఉండాలి అన్నట్లుగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే కొత్త సినిమా ప్రకటనకు చాలా టైం తీసుకుంటున్నాడు.
'కేజీఎఫ్-2' వచ్చి ఇప్పటికే ఎనిమిది నెలలు దాటింది. దీంతో యశ్ ఫ్యాన్స్ ఆయన కొత్త సినిమా ప్రకటన కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యశ్ పుట్టినరోజు కానుకగా జనవరి 8న ఆయన కొత్త మూవీ ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ చిత్ర భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ రూపొందనుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



