'వాల్తేరు వీరయ్య' మూడో పాట 'పూనకాలు లోడింగ్'!
on Dec 20, 2022

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వింటేజ్ మెగాస్టార్ ని బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలవుతున్న ఒక్కో పోస్టర్, సాంగ్స్ ఈ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'బాస్ పార్టీ', 'శ్రీదేవి చిరంజీవి' సాంగ్స్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. 'పూనకాలు లోడింగ్' అంటూ సాగే ఈ పాట పక్కా మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ 'పూనకాలు లోడింగ్' సాంగ్ లో చిరంజీవి, రవితేజ కలిసి మాస్ స్టెప్పులతో అలరించనున్నారని సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏసీపీ విక్రమ్ సాగర్ అనే పవర్ ఫుల్ పాత్రలో రవితేజ అలరించనున్నాడు. ఈ పాత్ర నిడివి సుమారుగా 45 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి రవితేజ చిందేసే 'పూనకాలు లోడింగ్' సాంగ్ నిజంగానే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంటుందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



