'అమ్మఒడి' పేరుతో సినిమా.. కీలక పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే!
on Dec 26, 2021

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ 'అమ్మఒడి' పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిదే పేరుతో టాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.
శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న అమ్మఒడి చిత్రానికి త్రినాథ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నారు. విశాఖ జిల్లా పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన ఆశ్రమ పాఠశాలలో తాజాగా చెట్టి ఫాల్గుణపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సందర్భంగా చెట్టి పాల్గుణ మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలలో అమ్మఒడి ఒకటని కొనియాడారు. అమ్మఒడి పథకంపై సినిమా తీయడం సంతోషంగా ఉందని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



