2021 జ్ఞాపకాలు: కిక్కెక్కించిన `ఐటమ్` సాంగ్స్!
on Dec 25, 2021

కమర్షియల్ సినిమాల్లో.. ఐటమ్ సాంగ్స్ పెద్ద రిలీఫ్! ఈ ఏడాది కూడా ఇలాంటి ప్రత్యేక గీతాలకు స్థానం దక్కింది. ఆ పాటల కోసం కొంతమంది కథానాయికలు ఫస్ట్ టైమ్ `ఐటమ్ గాళ్` అవతారమెత్తడం విశేషం. 2021లో కిక్ ఎక్కించిన ఆ `ఐటమ్` నంబర్స్ వివరాల్లోకి వెళితే..
ఫెస్టివల్ `స్పెషల్స్`:
`క్రాక్`, `రెడ్`, `అల్లుడు అదుర్స్`.. ఇలా 2021 సంక్రాంతికి సందడి చేసిన మూడు తెలుగు చిత్రాల్లోనూ `స్పెషల్` సాంగ్స్ కి స్థానం దక్కింది. `క్రాక్`లో ``భూమ్ బద్ధల్`` అంటూ సాగే పాటలో అప్సర రాణి చిందులేస్తే.. `రెడ్` కోసం ``డించక్`` అంటూ సాగే డాన్స్ నంబర్ కోసం ఫస్ట్ టైమ్ ఐటమ్ గాళ్ అవతారమెత్తింది హెబ్బా పటేల్. ఇక `అల్లుడు అదుర్స్` మూవీలో ``రంభ ఊర్వశి మేనక`` అంటూ యువ కథానాయిక, `బిగ్ బాస్ సీజన్ 4` ఫేమ్ మోనాల్ గజ్జర్ మొదటిసారిగా స్పెషల్ డాన్స్ నంబర్ చేసింది.
`శ్రీదేవి`తో `సీటీమార్`:
ఇక `శ్రీదేవి సోడా సెంటర్`లోని ``మందులోడా`` అంటూ సాగే ఐటమ్ నంబర్ లో స్నేహా గుప్తా తన స్టెప్స్ తో ఎంటర్టైన్ చేస్తే.. `సీటీమార్`లోని ``పెప్సీ ఆంటీ`` పాట కోసం తన నృత్యాలతో అప్సరా రాణి మరోమారు మెస్మరైజ్ చేసింది.
`ఊ` అనేసిన సామ్ః
కెరీర్ లో ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ చేయని స్టార్ బ్యూటీ సమంత.. `పుష్ప - ద రైజ్`లోని ``ఊ అంటావా మామా`` గీతం కోసం తొలిసారి ఊ అనేసింది. సదరు ప్రత్యేక గీతంలో ఊర మాస్ స్టెప్పులతో కుర్రకారుని ఫిదా చేసింది సామ్.
మొత్తమ్మీద.. 2021లో స్పెషల్ సాంగ్స్ అన్నీ కూడా సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా బాగానే ఉర్రూతలూగించాయనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



