అఫీషియల్.. నవీన్, అనుష్క మూవీ అప్డేట్ వచ్చేసింది!
on Dec 26, 2021

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా ఓ సినిమా రానుందని అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించనుందని న్యూస్ వినిపించింది. అయితే ఈ వార్తను నిజం చేస్తూ ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా మేకర్స్ ఇచ్చారు.
నేడు(డిసెంబర్ 26) నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా తాజాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ నవీన్ కొత్త మూవీ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించనుంది. యూవీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.14 గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వం వహించనున్నాడు. హీరోగా నవీన్ కి ఇది మూడో సినిమా కాగా.. అనుష్కకి ఇది 48 వ సినిమా.
ఈ మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. వయసులో తనకంటే 20 సంవత్సరాలు పెద్దదైన మహిళతో ఓ యువకుడు ప్రేమలో పడటం.. దానివల్ల వాళ్లిద్దరూ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమాలో చూపించనున్నారని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



