'రైటర్ పద్మభూషణ్'కి అదిరిపోయే కలెక్షన్లు!
on Feb 6, 2023
ఒక్కోసారి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయి. తాజాగా విడుదలైన 'రైటర్ పద్మభూషణ్' సినిమా ఆ దిశగానే పయనిస్తోంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సహా పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. టాక్ కి తగ్గట్లే రోజురోజుకి వసూళ్లు పెంచుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లోనే లాభాల్లోకి ఎంటర్ కావడం విశేషం.
ఫిబ్రవరి 3న విడుదలైన 'రైటర్ పద్మభూషణ్' తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.72 లక్షల గ్రాస్, రెండో రోజు రూ.1.25 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.1.33 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రూ.3.30 కోట్ల గ్రాస్(రూ.1.75 కోట్ల షేర్) సాధించింది.
ఇక వరల్డ్ వైడ్ గా చూస్తే మొదటి రోజు రూ.1.50 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.1.95 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.1.76 కోట్ల గ్రాస్ తో మూడు రోజుల్లో రూ.5.21 కోట్ల గ్రాస్(రూ.2.70 కోట్ల షేర్) రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రెండు కోట్లు కాగా ఇప్పటికే లాభాల్లోకి ప్రవేశించడం విశేషం. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే యూఎస్ లో ఈ మూవీ రెండు లక్షలకు పైగా డాలర్లు వసూలు చేసింది.
ఈ శుక్రవారం 'రైటర్ పద్మభూషణ్'తో పాటు విడుదలైన సినిమాలేవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. మరోవైపు వచ్చే శుక్రవారం 'అమిగోస్' మినహా పెద్ద సినిమాల తాకిడి లేదు. ఈ క్రమంలో ఫుల్ రన్ లో 'రైటర్ పద్మభూషణ్' మంచి వసూళ్లనే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
