సంతానంకి జోడీగా మేఘా ఆకాష్!
on Feb 6, 2023
కోలీవుడ్ యాక్టర్ సంతానం హీరోగా 'వడక్కుపట్టి రామసామి' అనే తమిళ్ మూవీ చేస్తున్నట్లు టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'విట్ నెస్', 'సాల' సినిమాలతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పీపుల్ మీడియా నిర్మిస్తున్న మూడో తమిళ్ సినిమా ఇది. 'డిక్కిలోన' వంటి సూపర్ హిట్ తర్వాత నటుడు సంతానం, దర్శకుడు కార్తీక్ యోగి ఈ చిత్రం కోసం చేతులు కలిపారు. ఇక ఇందులో హీరోయిన్ గా మేఘా ఆకాష్ నటిస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆమె డాక్టర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పొల్లాచిలో జరుగుతోంది.
సంతానం, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తమిజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో జాన్ విజయ్, ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మారన్, మొట్టా రాజేంద్రన్, నిజల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్వెలిన్ తదితరులు నటించనున్నారు. సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా దీపక్, ఎడిటర్ గా శివ నందీశ్వరన్, ఆర్ట్ డైరెక్టర్ గా రాజేష్, కొరియోగ్రాఫర్ గా షరీఫ్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పీరియడ్ కామెడీ-డ్రామాగా తెరకెక్కనున్న 'వడకుపట్టి రామసామి' అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
