'రైటర్ పద్మభూషణ్' వచ్చేస్తున్నాడు!
on Dec 29, 2022

యూట్యూబ్ వీడియోలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన సుహాస్.. అద్భుతమైన నటనతో సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 'కలర్ ఫోటో' చిత్రంతో హీరోగా మారి మెప్పించిన సుహాస్.. హీరోగా మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న 'రైటర్ పద్మభూషణ్'లో సుహాస్ స్ట్రగులింగ్ రైటర్ గా కనిపించనున్నాడు. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్ తో కలిసి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 'రైటర్ పద్మభూషణ్' ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలోకి రానుందని తెలుపుతూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో సుహాస్.. చక్కని చిరునవ్వుతో ప్రకాశం బ్యారేజీపై నిలబడి పోజు ఇవ్వడం ఆకట్టుకుంది.
అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మనోహర్ గోవిందస్వామి సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'కన్నుల్లో నీ రూపమే' చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర ట్రైలర్ ను త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, గౌరీ ప్రియ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



