తీవ్ర విషాదం నుంచి కోలుకొని కెమెరా ముందుకు వస్తున్న మీనా!
on Dec 29, 2022
.webp)
తెలుగులో తరుణ్, మీనాల గురించి తెలియని వారు ఉండరు.ఎందుకంటే వీరు బాలనటులుగా పరిచయమై ఆ తర్వాత హీరో హీరోయిన్లుగా రాణించారు. మీనా విషయానికి వస్తే ఎన్నో చిత్రాల్లో బాలనాటిగా ఆకట్టుకున్న ఆమె సీతారామయ్యగారి మనవరాలు, చంటి వంటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో నటించి ఓ ఊపు ఊపింది. ఈ చిత్రాలతో పాటు ఆమె నటించిన సుందరాకాండ, అల్లరి మొగుడు ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ముఠామేస్త్రి, అబ్బాయిగారు, అల్లరి అల్లుడు, పుణ్యభూమి నాదేశం, అంగరక్షకుడు, బొబ్బిలి వంశం, మా అన్నయ్య, శ్రీ మంజునాథ, అమ్మాయి కోసం వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2009లో విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. అతను ఇదే ఏడాది మరణించారు. ఆమెకు నైనిక అనే కుమార్తె కూడా ఉంది. బెంగళూరు లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న ఆమె భర్త మరణించడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జూన్ 28న తన భర్త మరణించినప్పటి నుంచి మీనా బాగా కృంగిపోయింది. అయితే మెల్ల మెల్లగా ఆ విషాదం నుంచి కోలుకుంటూ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం. ఈమె బాలనటిగా హీరోయిన్‌గా దాదాపు మూడు నాలుగు తరాలకు పరిచయం ఉంది. సాగర్ మృతి చెందిన సమయంలోనే మీనా కొన్ని సినిమాలను కమిట్ అయి ఉన్నారు. ఆ సినిమాలు కొన్ని క్యాన్సిల్ కాగా మరికొన్ని మీనా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ లో మీనా మళ్ళీ పాల్గొనబోతుందని సమాచారం.
దృశ్యం 3 సినిమాతో ఆమె సినీ జర్నీ మరలా మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో మీనా పాల్గొంటుంది. ఆ వెంటనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని అని సమాచారం. విద్యాసాగర్ వియోగ బాధ నుండి తేరుకునేందుకు ఆమె ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆమె కొన్ని వారాలపాటు సన్నిహితుల వద్ద ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన మీనా మెల్లమెల్లగా సినిమాలతో బిజీ అవ్వాలని భావిస్తున్నారు. సినిమాలతో బిజీ అయితే ఆ విషాదం నుంచి మరింతగా బయటపడే అవకాశం ఉంటుందని డాక్టర్లు సైతం ఆమెకు సూచించారట. మానసిక వైద్యుల సలహా మేరకు సినిమాలలో బిజీ అవ్వడం ద్వారా ఈ విషాదం నుంచి బయటపడడానికి మీన తన వంతు ప్రయత్నం చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



