పవన్-క్రిష్ కాంబోకు కీరవాణి తోడయ్యారు!
on Dec 29, 2022

'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్'లతో దేశవ్యాప్తంగా ఎంఎం కీరవాణి అలియాస్ క్రీమ్ పేరు మారుమోగిపోయింది. ఇక 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఆయన లెవెల్ హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగింది. ఈ సినిమా విజయంలో 'నాటు నాటు' సాంగ్ కీరోల్ పోషించింది. ఇప్పుడు అదే పాట ఆస్కార్ బరిలోనూ నిలిచింది. ఆస్కార్ షార్ట్ లిస్టులో బెస్ట్ సాంగ్స్ జాబితాలో 'నాటు నాటు' నిలవడం దేశం గర్వించదగ్గ విషయం. మొత్తం 81 పాటలు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. అన్ని పాటల్లోంచి ఈ పాట ఇలా షార్ట్ లిస్ట్ కావడంతో ఈ పాటకు సంగీతం అందించిన ఎంఎం కీరవాణి పేరు ఇంకా బయట హాట్ టాపిక్‌గా మారింది. 'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజ్, 'ఆర్ఆర్ఆర్'తో పాన్ వరల్డ్ రేంజ్‌ని అందుకున్న కీరవాణి.. ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకుంటే ఇక కావాల్సిందేముంది...!
కాగా ఇప్పుడు కీరవాణికి లభిస్తోన్న క్రేజ్... ఆయనకు వచ్చిన పేరు 'హరిహర వీరమల్లు' మార్కెట్‌కు చాలా బాగా ఉపయోగపడుతుందని సమాచారం. 'ఆర్ఆర్ఆర్' తర్వాత కీరవాణి స్వరాలు అందిస్తోన్న పెద్ద సినిమా 'హరిహర వీరమల్లు'. దాంతో 'ఆర్ఆర్ఆర్' తర్వాత కీరవాణి సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే అంటూ అన్ని చోట్లా హడావుడి మొదలైంది. 'వీరమల్లు' సినిమా కూడా పాన్ ఇండియా చిత్రంగా ఫేమస్ అవుతోంది. యూనిట్ ఇంకా ఎలాంటి ప్రచారం మొదలు పెట్టకుండానే 'వీరమల్లు' పేరు అన్ని చోట్ల వినిపిస్తోంది. అందుకు కారణం కీరవాణి అంటున్నారు. కొందరు 'ఆర్ఆర్ఆర్'కి పనిచేసిన సంగీత దర్శకుడు 'హరిహర వీరమల్లు'కు కూడా సంగీతం అందిస్తున్నాడంట కదా అంటూ చర్చ సాగుతోంది...! దీంతో మ్యూజిక్ కంపెనీలు, డిజిటల్ కంపెనీలు ఈ చిత్రం రైట్స్ కోసం అప్పుడే పోటీ పడుతున్నాయి. ఓటీటీ కంపెనీలు ప్రధానంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సినిమాని తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ కి ఉన్న క్రేజ్, దర్శకునిపై ఉన్న నమ్మకం, కీరవాణి బ్రాండ్ ఇమేజ్ అని అర్థమవుతుంది.
పవన్ కు సౌత్ ఇండియాలో తప్పితే.. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో, తమిళ, కన్నడలో ఉన్న కొందరు మినహా నార్త్‌లో పెద్దగా క్రేజ్ లేదు. కానీ అనూహ్యంగా అక్కడి నుంచి ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. కానీ చిత్ర నిర్మాత మాత్రం ఏమాత్రం తొందరపడటం లేదు. బిజినెస్ గేట్లను ఇంకా తెరవలేదు. మరి ఈ క్రేజ్ ని 'హరిహర వీరమల్లు' మేకర్స్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు వేచిచూడాల్సి వుంది...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



