'కృష్ణమ్మ'తో అయినా సత్యదేవ్ కెరీర్ ఊపందుకుంటుందా?
on Jul 4, 2022
ప్రతిభావంతుడైన నటునిగా అందరి ప్రశంసలూ అందుకుంటున్న సత్యదేవ్ ఇటీవల వరుసగా ఫ్లాపులను చవిచూస్తూ వస్తున్నాడు. అతని మునుపటి సినిమా 'గాడ్సే' బాక్సాఫీస్ దగ్గర కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక డిజాస్టర్‌గా నిలిచింది. లేటెస్ట్‌గా అతను 'కృష్ణమ్మ' అనే యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. ఈరోజు సత్యదేవ్ బర్త్‌డేని పురస్కరించుకొని నిర్మాతలు ఆ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో ఆయుధం పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు సత్యదేవ్. వి.వి. గోపాలకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అరుణాచల క్రియేషన్స్ నిర్మిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన విశేషం.. టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ సమర్పకునిగా వ్యవహరిస్తుండటం! ఆయన మునుపటి మూవీ 'ఆచార్య' బిగ్ డిజాస్టర్‌గా నిలిచినా, ఆయన బ్రాండ్ వాల్యూలో మార్పేమీ రాలేదు. ఆ బ్రాండ్‌తో మునిగిపోతున్న తన కెరీర్‌ను నిలబెట్టుకోడానికి సత్యదేవ్ ప్రయత్నిస్తున్నాడు. కొరటాల తమ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతాడనీ, 'కృష్ణమ్మ' సినిమాకు అతని కారణంగా హైప్ వస్తుందనీ దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు.
ఈ సినిమా కనుక ప్రేక్షకాదరణ పొందితే, అతని కెరీర్‌కు పెద్ద ఊరట లభించినట్లే. ఈలోగా తమన్నాతో కలిసి అతను నటించిన 'గుర్తుందా శీతాకాలం' సినిమా జూలై 15న విడుదలకు రెడీ అవుతోంది. 'ఫుల్ బాటిల్'లో హీరోగా నటిస్తోన్న అతను, చిరంజీవి 'గాడ్‌ఫాదర్'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తొలిసారి బాలీవుడ్‌లో 'రామ్‌సేతు' అనే మూవీ చేస్తున్నాడు. అందులో అక్షయ్ కుమార్ హీరో.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
