అల్లూరి సీతారామరాజు.. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
on Jul 4, 2022
యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అల్లూరి'. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
'అల్లూరి' సినిమాలో ఎస్సై అల్లూరి సీతారామరాజు పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నాడు. నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా 'అల్లూరి' టీజర్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. టీజర్ లో విష్ణు యూనిఫామ్ ధరించి డ్యూటీకి వెళ్తుండగా.. "ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.. పోలీస్ బయల్దేరాడురా" అంటూ నారా రోహిత్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. తప్పు చేస్తే ఎంతటివారినైనా దండించే పవర్ ఫుల్ పోలీస్ గా విష్ణు కనిపిస్తున్నాడు. "విప్లవానికి నాంది.. చైతన్యానికి పునాది.. నిజాయితీకి మారుపేరు" అంటూ అల్లూరి పాత్ర తీరుని వాయిస్ ఓవర్ తో తెలియజేశారు. ఇక చివరిలో అడవిలో నక్సలైట్ల నడుమ "అల్లూరి సీతామరామరాజు.. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్" అని విష్ణు గట్టిగా అరిచి చెప్పగానే.. చుట్టూ ఉన్న నక్సలైట్లు తుపాకులు ఎక్కు పెట్టడంతో టీజర్ ముగిసింది.
ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తన గత చిత్రాలు 'అర్జున ఫల్గుణ', 'భళా తందనాన'తో ఆశించినస్థాయిలో అలరించలేకపోయిన శ్రీవిష్ణు 'అల్లూరి'తో పూర్తిస్థాయిలో అలరిస్తాడేమో చూడాలి.
Also Read