దర్శకుడిగా మారిన 'పెళ్లి చూపులు' కమెడియన్
on Jul 4, 2022
'పెళ్లి చూపులు' సినిమాలో ప్రియదర్శితో పాటు విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించిన అభయ్ బేతిగంటి దర్శకుడిగా మారాడు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.
అభయ్ బేతిగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రామన్న యూత్'. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చేతుల మీదుగా ఈరోజు(సోమవారం) మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్ ను బట్టి చూస్తే తెలంగాణలోని అంక్షాపూర్ అనే విలేజ్ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. పిల్లల ఆటలు, పెద్దల ముచ్చట్లు, యూత్ హడావిడితో పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అభయ్ బేతిగంటి అందించడం విశేషం. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజిని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సయ్యద్ కమ్రాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా ఫహద్ అబ్దుల్ మజీద్, ఎడిటర్ రూపక్ రోనాల్డ్సన్ వ్యవహరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
