యానిమల్ దెబ్బకి ఆ ఇద్దరి హీరోల పరిస్థితి ఏంటి
on Nov 28, 2023
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా తెలుగునాట యానిమల్ ఫీవర్ ఒక పొగ మంచులా ముసురుకుంటుంది అనేది వాస్తవం. మన తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుందని ఎలా అనుకుంటున్నామో అలాగే ఇప్పుడు యానిమల్ కూడా పాన్ ఇండియా సినిమాగా మారింది. పైగా యానిమల్ మూవీ భాషతో సంబంధంలేకుండా ఒక సినిమాకి ఎంత పవర్ ఉంటుందో మరోసారి చాటిచెప్పింది.తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం యానిమల్ తెలునాట ఇద్దరు హీరోలకి ఇబ్బందిగా మరవచ్చనే టాక్ ఒకటి వినబడుతుంది.
మరికొన్ని రోజుల్లో అంటే డిసెంబర్ 1 న యానిమల్ తెలుగు నాట ఘనంగా అడుగుపెట్టబోతున్నాడు. ట్రైలర్ రిలీజ్ తో యానిమల్ కోసం యువత మొత్తం ఎదురుచూస్తుంది.అలాగే డిసెంబర్ 7 న నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న తో పాటు 8 న నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే సాధారణంగా యానిమల్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయితే డిజాస్టర్ అవుతాయి. హిట్ అయితే మాత్రం మాములు హిట్ అవ్వదు.అవతలి సినిమాలు కోలుకోలేని రేంజ్ లో హిట్ అవుతాయి. యానిమల్ ట్రైలర్ చూసిన ఎవరికైనా యానిమల్ ప్లాప్ అవుతుందని అనుకోరు. పైగా సందీప్ రెడ్డి నుంచి నాలుగేళ్ళ తర్వాత వస్తున్న మూవీ ఇది. కాబట్టి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి అలా జరిగితే నితిన్ కి నాని కి ఇబ్బంది అవ్వచ్చని ట్రేడ్ వర్గాలు వారు భావిస్తున్నారు.
నాని మూవీ క్లాస్ స్టోరీ కాగా నితిన్ సినిమా పక్కా కమర్షియల్ మూవీ. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాగుంటే వీటికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రెండు సినిమాలు కొంచం తేడా గా ఉంటే మాత్రం యానిమల్ సునామి లో మునిగిపోవడం ఖాయం .కానీ యానిమల్ మూవీనే తేడాగా ఉంటే మాత్రం ఈ రెండు సినిమాల ప్రభావం లేకుండానే అది కూడా మునిగిపోవడం ఖాయం అని కూడా ట్రేడ్ వర్గాలు వారు భావిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
