సినిమా రిలీజ్ విషయంలో హీరో సీరియస్.. పట్టించుకోని నిర్మాత!
on Nov 28, 2023
ఒకప్పుడు ఒక సినిమా నిర్మాణం జరుగుతోంది అంటే ఆ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతను దేవుడిగా భావించేవారు యూనిట్ సభ్యులు. ఎందుకంటే సినిమా ఆడుతుందో లేదో తెలీదు, పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో లేదో తెలియని స్థితిలో ఆ నిర్మాత ఉంటాడు. అందుకే అతని మాటకు యూనిట్‌లోని అందరూ వాల్యూ ఇచ్చేవారు. రాను రాను ఈ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు నిర్మాత అంటే కేవలం సూట్ కేసులో డబ్బు పెట్టుకొని కూర్చోవాలి తప్ప ఏ విషయంలోనూ ఇన్‌వాల్వ్ అవ్వడానికి లేదు. హీరో నుంచి టెక్నీషియన్స్ వరకు ఇప్పుడు అందరిదీ ఇదే ఆలోచన. నిర్మాతను గౌరవించే వారిని ఇప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చెయ్యాలని మొదట నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, సినిమాని ఆ డేట్‌కి రిలీజ్ చెయ్యడం చాలా కష్టం అని భావించిన నిర్మాతలు రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో వున్నట్టు తెలుసుకున్న హీరో విశ్వక్ సేన్ ఓ ప్రకటన చేశాడు. అదేమిటంటే.. సినిమా అనుకున్న టైమ్‌కి రిలీజ్ చెయ్యకపోతే ప్రమోషన్స్‌కి రాను అంటూ సీరియస్‌గా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశాడు. దీన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అంత సీరియస్‌గా తీసుకున్నట్టు లేడు. అందుకే ఈ విషయంపై ఎక్కడా కామెంట్ చెయ్యలేదు. అంతేకాదు, సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు. సినిమా రిలీజ్‌ను వాయిదా వెయ్యడానికి కారణం ఉంది. అదేమిటంటే.. షూటింగ్ పూర్తవ్వడానికి మరో 10 రోజులు పడుతుందట. అందుకే వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలని భావిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
