ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన మంచు మనోజ్.. ఏ పార్టీ కోసమో తెలుసా?
on Nov 28, 2023
సినిమా తారలు రాజకీయ నాయకులకు చాలా సందర్భాల్లో సపోర్ట్ చెయ్యడం మనం చూస్తుంటాం. అయితే ఇది ఎన్నికల సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా తారలు ప్రచారంలో పాల్గొంటే పోటీలో ఉన్న అభ్యర్థికి ఎంతో ప్లస్ అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించడం సహజం. అందుకే ప్రతి ఎన్నికల సమయానికి తమ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు సినిమా సెలబ్రిటీలను రంగంలోకి దింపడం ఆనవాయితీగా వస్తోంది. ఏ సెలబ్రిటీ ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తించే అంశం.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా ఎంతో వేడెక్కి ఉంది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎవరి వ్యూహాలకు తగ్గట్టు వారు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే సినిమా తారలు కూడా ఎన్నికల ప్రచారంలో భాగం అవుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన పైలట్ రోహిత్‌రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి ఎన్నికల్లో తాండూరు బిఆర్‌ఎస్ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డి పోటీలో ఉన్నారు. రోహిత్‌రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మంగళవారం తాండూరు బయల్దేరుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తాండూరులో ఎన్నికల ప్రచారంలో మంచు మనోజ్ పాల్గొంటారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
