కాళ్లూ... చేతులూ నరుకుతారట
on Jul 29, 2017
ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటాడు తమిళ నటుడు విశాల్. తన సీనియర్లతో గొడవకు దిగి... వారిని ఎదిరించి మరీ తమిళ నిర్మాతల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అయ్యాడు. నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఓ వైపు సినిమాలు ఎలాగూ ఉంటాయ్. పొద్దున లేచినప్పట్నుంచీ బిజీ బిజీ... అలాంటి విశాల్ కి ఈ మధ్య శత్రుభయం ఎక్కువైంది. డైరెక్ట్ గా ఇంటికే ఫోన్లు చేసి బెదిరింపులకు తెగబడుతున్నారు కొందరు. మొదట్నుంచీ ఇలాంటివి కేర్ చేయని తత్వం విశాల్ ది. అతని ధైర్యం ఎలా ఉంటుందంటే... డైరెక్ట్ గా బెంగళూర్ వెళ్లి అక్కడ కావేరీ జలాల ఇష్యూపై దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన ఘటికుడు తను.
అటువంటి విశాల్ కి బెదిరింపు రావడం ఇప్పుడు చెన్నయ్ లో చర్చనీయాంశమైంది. ఆ బెదిరింపులు కూడా మామూలుగా లేవట. ‘నీ కాళ్లూ చేతులు నరుతాం... కళ్లు పీకుతాం’అంటూ చాలా ఘాటుగానే బెదిరిస్తున్నారట. ఈ విషయంపై విశాల్ గురువారం చెన్నయ్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఇంతకీ విశాల్ ని బెదిరిస్తున్న ఆ వ్యక్తులు ఎవరై ఉంటారబ్బా...!