బాలయ్య సొంత కుంపటి
on Jul 29, 2017

తన తోటి హీరోల్లో బాలకృష్ణ నిజంగా స్పెషల్. బాలయ్య సమకాలీనులైన చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున... ముగ్గురికీ సొంత నిర్మాణ సంస్థలున్నాయి. కానీ బాలయ్యకు మాత్రం ఇప్పటికీ సొంత నిర్మాణ సంస్థ లేదు. ఎన్టీయార్ స్థాపించిన ‘రామకృష్ణా స్టూడియోస్’ప్రస్తుతం బాలయ్య తమ్ముడైన రామకృష్ణ చేతుల్లో ఉంది. కానీ... ఆయన సినిమాలు నిర్మించి దాదాపు ఇరవై ఏళ్లు కావొచ్చింది. ప్రస్తుతానికైతే.. బాలయ్యకు సొంత బ్యానర్ లేదు. అయితే... త్వరలో ఓ సొంత నిర్మాణ సంస్థ స్థాపించడానికి బాలయ్య రెడీ అవుతున్నట్లు టాక్. తన సన్నిహిత మిత్రలు భాగస్వామిగా ఆయన సొంత నిర్మాణ సంస్థ స్థాపించనున్నట్లు తెలిసింది. అందరు హీరోలతో సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు సమాచారం. ఆ సంస్థలో తొలి చిత్రం మాత్రం బాలయ్య కుమారుడు మోక్షజ్ణతో నే ఉంటుందని సమాచారం. ఇది నందమూరి అభిమానులకు నిజంగా శుభవార్తే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



