డ్రగ్స్ వ్యవహారంలో యాభై మంది పేర్లు బయటపెట్టిన హీరోగారు
on Jul 29, 2017

డ్రగ్స్ కేసు రసకందాయంలో పడింది. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖుల్ని ఈ విషయంపై విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజా అప్టేట్ ప్రకారం పోలీసుల దగ్గరకి కీలక సమాచారం చేరినట్టు తెలిసింది. ఆ సమాచారాన్ని పోలీసులకు చెప్పింది ఎవరో కాదు... ఈ 12 మందిలో ఒకరు. ప్రస్తుతానికి సినిమాలు లేక పబ్బులతో క్లబ్బులతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఓ హీరో... మొత్తం 50 మంది పేర్లు విచారణలో వివరించినట్లు తెలిసింది. అయితే... ఈ యాభై మందీ సినిమావారు మాత్రమే కారు. ఇందులో రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలకు సంబందించిన పెద్దలూ ఉన్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరో విషయం ఏంటంటే... ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీయార్ పోలీసులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు సినిమా రంగంవారు ఊపిరిపీల్చుకునేలా ఉన్నాయి.
డ్రగ్స్ కి అలవాటు పడి, రోజూ మాదకద్రవ్యాలతో జీవితాలను సాగించే వారిని దోషులుగా పరిగణించొద్దనీ, వారు కేవలం బాధితులు మాత్రమే అనీ, విదేశాల నుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చిఇక్కడ విక్రయిస్తున్న ముఠాలను మాత్రం అస్సలు వదలొద్దని కేసీయార్ పోలీసులకు సూచించారు. సో... ఈ కేసు వ్యవహారంలో చిక్కుకున్న సినీ ప్రముఖులకు ఇది నిజంగా ఊరట కలిగించే విషయమే. ఇంతకీ... డ్రగ్స్ తీసుకునే యాభై మంది పేర్లను విచారణలో పోలీసుల ముందు చదివిన ఆ హీరోగారు ఎవరు? ఆ యాభై మందిలో ప్రముఖులు ఎవరెవరు బయటకు రానున్నారో తెలియాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



