శివరాత్రికి 'విష్ణు కథ'.. కిరణ్ కి కలిసొచ్చేనా?
on Oct 29, 2022

ఈ ఏడాది 'సెబాస్టియన్', 'సమ్మతమే', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమాలతో పలకరించి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వచ్చే ఏడాది లెక్క సరిచేయాలని చూస్తున్నాడు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో అతను నటిస్తున్న 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. శివరాత్రి కానుకగా 2023, ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ని వదిలారు. అందులో కిరణ్ చేతులెత్తి మొక్కుతుండగా, ఒక గ్యాంగ్ గన్స్ పట్టుకొని అతణ్ణి రౌండప్ చేయడం ఆకట్టుకుంటోంది.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా డేనియల్ విశ్వాస్, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



