షాకింగ్.. సమంతకి అరుదైన అనారోగ్య సమస్య
on Oct 29, 2022

హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజమేనని చెప్పి తాజాగా షాక్ ఇచ్చింది సమంత. తాను ఒక అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని, కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పింది.
సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న 'యశోద' మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం ప్రస్తుతం సమంత డబ్బింగ్ చెబుతోంది. దీనికి సంబంధించిన ఫోటోని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటోలో ఆమె చేతికి సెలైన్ ఉంది. మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతున్న తాను కొద్ది నెలలుగా చికిత్స తీసుకుంటున్నానని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సమంత రాసుకొచ్చింది. దీని నుంచి కోలుకోవడానికి తాను అనుకున్నదానికంటే ఎక్కువ సమయమే పడుతుందని, త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారని చెప్పింది. జీవితంలో శారీరికంగా, మానసికంగా మంచి, చెడులను చూసిన తాను.. దీని నుంచి కూడా త్వరలోనే బయటపెడతానని సమంత చెప్పుకొచ్చింది.

అనారోగ్యంతో ఉండి కూడా సెలైన్ పెట్టుకొని మరీ సినిమా డబ్బింగ్ చెబుతున్న సమంత డెడికేషన్ పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు సమంత త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



