300 కోట్ల క్లబ్ లో 'విక్రమ్'.. 'పుష్ప' ప్లేస్ కి ఎసరు!
on Jun 14, 2022

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషించిన 'విక్రమ్' మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. జూన్ 3న విడుదలైన ఈ సినిమా 11 రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్ లో చేరి సత్తా చాటింది.
విడుదలైన రోజు నుంచే రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విక్రమ్ మూవీ 11వ రోజు కూడా వరల్డ్ వైడ్ గా 7.05 కోట్ల షేర్(14.40 కోట్ల గ్రాస్) తో సత్తా చాటింది. 11వ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 155.05 కోట్ల షేర్, 310.11 కోట్ల గ్రాస్ రాబట్టింది. సౌత్ సినిమా చరిత్రలో 300 కోట్ల క్లబ్ లో చేరిన తొమ్మిదో సినిమాగా విక్రమ్ నిలిచింది. 'బిగిల్'(300 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ ని దాటిన ఈ సినిమా.. అత్యధిక గ్రాస్ రాబట్టిన సౌత్ సినిమాల లిస్టులో 8 వ స్థానంలో నిలిచింది. దానికి ముందు స్థానంలో 360 కోట్లతో 'పుష్ప: ది రైజ్' ఉంది. ప్రస్తుతం 'విక్రమ్' దూకుడు చూస్తుంటే త్వరలోనే 'పుష్ప' కలెక్షన్స్ ని బీట్ చేసే అవకాశముంది. ఇక అత్యధిక గ్రాస్ రాబట్టిన తమిళ్ సినిమాల లిస్టులో 'విక్రమ్' రెండో స్థానంలో నిలిచింది. 709 కోట్ల గ్రాస్ తో '2.O' మూవీ మొదటి స్థానంలో ఉంది.
11 రోజుల్లో తమిళనాడులో 130.20 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 24.21 కోట్లు, కర్ణాటకలో 17.55 కోట్లు, కేరళలో 30.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 7.05 కోట్లు, ఓవర్సీస్ లో 100.20 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల బిజినెస్ చేసిన విక్రమ్ 11 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 13.86 కోట్ల షేర్(24.21 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ సినిమా భారీ లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలవనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



