చిరంజీవి `జ్వాల`కి 37 వసంతాలు!
on Jun 14, 2022

మెగాస్టార్ చిరంజీవి పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. వాటిలో `జ్వాల` ఒకటి. రాజుగా, యువరాజుగా చిరు రెండు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాని అగ్ర దర్శకుడు రవిరాజా పినిశెట్టి తెరకెక్కించారు. కాలక్రమంలో హిట్ కాంబినేషన్ గా నిలిచిన చిరంజీవి - రవిరాజా పినిశెట్టి కలయికలో రూపొందిన మొదటి చిత్రమిదే కావడం విశేషం.
చిరంజీవికి జంటగా రాధిక, భానుప్రియ నటించిన ఈ సినిమాలో గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, సాయికుమార్, అన్నపూర్ణ, జేవీ రమణ మూర్తి, రాళ్ళపల్లి, చిట్టిబాబు, సిల్క్ స్మిత, జయమాలిని ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రవిరాజా పినిశెట్టి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి సత్యమూర్తి సంభాషణలు సమకూర్చారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు `జ్వాల`కి ఎస్సెట్ గా నిలిచాయి. ``కలికి చిలక``, ``ఏవో కలలు కన్నాను``, ``ఎన్నెల ఎన్నెల``, ``తళాంగు ధింత`` ఇలా దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి పదరచన చేసిన పాటలన్నీ ఆకట్టుకున్నాయి. పి.ఎన్.ఆర్. పిక్చర్స్ పతాకంపై పింజల నాగేశ్వర రావు నిర్మించిన `జ్వాల`.. కన్నడంలో `సత్యం శివం సుందరం` (1987) పేరుతో విష్ణువర్థన్ త్రిపాత్రాభినయంలో రీమేక్ అయింది. కాగా, 1985 జూన్ 14న విడుదలై జనీరాజనాలు అందుకున్న `జ్వాల`.. నేటితో 37 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



