విజయకాంత్ కాలి వేళ్ల తొలగింపు.. ఆందోళనలో ఫ్యాన్స్!
on Jun 22, 2022
కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆస్పత్రి పాలయ్యారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన కాలి వేళ్లను వైద్యులు అత్యవసరంగా తొలగించారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
విజయకాంత్ ఆరోగ్యం గురించి డీఎండీకే పార్టీ కార్యాలయం తరఫున తాజాగా ఒక ప్రకటన వెలువడింది. విజయకాంత్ కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారని, ఆయన కుడి కాలి మూడు వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా వాటిని తొలగించారని ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పార్టీ కార్యాలయం తెలిపింది. ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని అభిమానులను, కార్యకర్తలను కోరింది.