విజయ్ సేతుపతికి తాగుడు ఎలా అలవాటైంది?
on Oct 3, 2022

మద్యపానం, ధూమపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని సినిమాను స్టార్ట్ చేయడానికి ముందు ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తారు. అయితే ఇలా సూచించే హీరోల్లో ఎంత మంది తాగుడుకు దూరంగా ఉంటారు? ఎవరెవరు మద్యాన్ని ఇష్టపడతారనే టాక్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. రీసెంట్‌గా ఓ కాలేజ్ ఫంక్షన్‌కి వెళ్లిన విజయ్ సేతుపతి కూడా ఈ టాపిక్ తీసుకొచ్చారు. దానికీ ఓ రీజన్ ఉంది. ఇప్పుడు ఓ వైపు మంచి మంచి కథల్లో హీరోగా నటిస్తూ, ఇతర హీరోల సినిమాల్లో కేరక్టర్లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి.
అయితే ఆయనకు ఇంటర్ సెకండ్ ఇయర్‌లో పెద్దగా చదువు ఎక్కలేదట. మార్కులు కూడా పెద్దగా రాలేదట. మూడు కాలేజీలకు అప్లై చేస్తే మూడు చోట్లా సీటు రాలేదట. ఇంటికెళ్తే వాళ్ల నాన్న మద్యం సేవిస్తూ కనిపించారట. అప్పటి నుంచి విజయ్ సేతుపతికి కూడా మద్యపానాన్ని సేవించడం అలవాటైందట. తాను చేసినంత మాత్రాన, అదేదో ఉత్తమ పని అనుకోవద్దని యూత్‌కి సలహా ఇచ్చారు సేతుపతి.
జీవితంలో సెటిల్ కావాల్సిన సమయంలో టైమ్ పాస్ పనులు పెట్టుకోవద్దని సూచించారు. అంతే కాదు, ఇప్పుడున్న సొసైటీ మన దగ్గరి నుంచి మన సమయాన్ని దొంగలిస్తోందని అన్నారు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయగలిగినంత మాత్రాన, దాన్ని నిజమైన స్వేచ్ఛగా భావించకూడదని, స్వేచ్ఛ అనే ముసుగులో మనమంతా బతుకుతున్నామనీ చెప్పారు.
జీవితంలో ఎంపిక చేసుకున్న రంగంలో సక్సెస్ సాధించినప్పుడు, పిచ్చి పిచ్చి పనులకు యువత దూరంగా ఉంటారని అన్నారు సేతుపతి. ఆయన స్పీచ్ ఇన్‌స్పిరేషనల్‌గా ఉందంటున్నారు యూత్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



