పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి స్టార్లు అందుకున్న పారితోషికం వివరాలు..!
on Oct 3, 2022

తమిళ సినిమా హిస్టరీలోనే ఇప్పటిదాకా ఏ సినిమాకూ రానంతగా ఫస్ట్ డే కలెక్షన్లు రాబట్టింది మణిరత్నం మేగ్నమ్ ఆపస్ పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాకు తొలిరోజు రూ.80 కోట్లు కలెక్షన్లు రాగా, ఇప్పటికే రూ.200కోట్ల మార్కును దాటేసింది. పెద్దాచిన్నా తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారట జనాలు.
మణిరత్నం మెడ్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకున్నారో తెలుసా? కోలీవుడ్ సమాచారం ప్రకారం విక్రమ్‌కి రూ.12కోట్లు ఇచ్చారట. నందిని కేరక్టర్‌లో నటించిన ఐశ్వర్య రాయ్‌కి రూ.10కోట్లు ఇచ్చారట. జయం రవికి రూ.8 కోట్లు, కార్తికి రూ.5కోట్లు, త్రిషకి రూ.2కోట్లు, ప్రకాష్‌రాజ్‌కి రూ.2కోట్లు ఇచ్చారట.
పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం ఒరిజినల్ ఆర్నమెంట్స్‌ని వాడారు మణిరత్నం. నందిని కేరక్టర్ చేసిన ఐశ్వర్యరాయ్, కుందవై పాత్ర పోషించిన త్రిష చాలా సన్నివేశాల్లో ఒరిజినల్ నగలనే ధరించారు.
కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 30న పీయస్1 విడుదలైంది. రెండో పార్టును మరో తొమ్మిది నెలల్లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మణిరత్నం తెలిపారు. తాను తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌కీ బాహుబలికీ ఎలాంటి పోలికా లేదన్నారు మణిరత్నం. నవల ఆధారంగా చేసుకుని చోళ సామ్రాజ్యాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశానని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



