హరిద్వార్‌కి మహేష్... ఎందుకెళ్లారో తెలుసా?
on Oct 3, 2022

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమాల విషయంలో ఎంత ప్రొఫెషనల్‌గా కనిపిస్తారో, పర్సనల్ లైఫ్‌లో అంత ఎమోషనల్ పర్సన్. షూటింగులు లేకుంటే టైమ్ అంతా ఫ్యామిలీకే కేటాయిస్తారు. ఏమాత్రం తీరిక దొరికినా అమ్మ దగ్గరకు వెళ్లి కాఫీ తాగి కబుర్లు చెప్పి, ఆమె చేత నాని నాని అని పిలిపించుకుంటూ మురిసిపోయేవారు. ఇప్పుడు ఆ రోజులను మిస్ అవుతున్నారు మహేష్.
ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె పరమపదించిన తర్వాత ప్రతి కార్యక్రమాన్నీ దగ్గరుండి చేస్తున్నారు మహేష్. ఆమె ఆస్తికలను కలపడం కోసం హరిద్వార్ వెళ్లారు. ఆయనతో పాటు మహేష్ చిన్నాన్న ఆదిశేషగిరిరావు కూడా అక్కడికి వెళ్లారు.

ఆ ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన అభిమానులు మహేష్‌ని ఓదారుస్తున్నారు. `నువ్వు అలా ఉండకన్నా. నిన్నెప్పుడూ అలా చూడలేదు. కాస్త ఓర్చుకో` అంటూ పోస్టులు పెడుతున్నారు.
పరామర్శకు వచ్చిన వారిని నమ్రత ఇంటి దగ్గరుండి పలకరిస్తున్నారు. ఇందిరాదేవి మరణించిన తర్వాత ఆమెను మిస్ అవుతున్న నమ్రత `మీరు నాకు పంచిన ప్రేమను జన్మలో మర్చిపోలేను మమ్మీ. మీ అబ్బాయికి, మీ మనవడికి, మనవరాలికి ఆ ప్రేమను పంచుతాను` అని పెట్టిన పోస్టు కూడా వైరల్ అవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



