ప్రభాస్ 'స్పిరిట్'లో మరో టాలీవుడ్ స్టార్!
on Jan 21, 2026

మరోసారి వార్తల్లో స్పిరిట్ మూవీ
స్పిరిట్ లో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ స్టార్
సందీప్ రెడ్డి వంగా ఆఫీస్ కి వెళ్ళిన విజయ్
కేవలం అనౌన్స్ మెంట్ తోనే మోస్ట్ హైప్డ్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా పేరుపొందిన చిత్రం 'స్పిరిట్'(Spirit). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీలో.. వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇక తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. ఇందులో టాలీవుడ్ కి చెందిన ఓ యూత్ స్టార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు.. విజయ దేవరకొండ. (Vijay Deverakonda)
'స్పిరిట్'లో విజయ దేవరకొండ నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇటీవల సందీప్ రెడ్డి వంగా ఆఫీస్ కి విజయ్ వెళ్ళాడు. స్పిరిట్ గురించి చర్చించడానికే సందీప్ ఆఫీస్ కి విజయం వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.
.webp)
విజయ్ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాతోనే సందీప్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. సందీప్ అడగాలే కానీ.. ఏ మాత్రం ఆలోచించకుండా నటించడానికి ఒప్పుకుంటాడు విజయ్.
పైగా తన స్నేహితుల సినిమాల్లో అతిథి పాత్రల్లోనో, ప్రత్యేక పాత్రల్లోనో మెరవడం విజయ్ దేవరకొండకి అలవాటే. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన 'ఈ నగరానికి ఏమైంది'లో విజయ్ గెస్ట్ రోల్ చేశాడు. నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతి రత్నాలు'లో అతిథి పాటలో మెరవడమే కాకుండా, ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన 'కల్కి'లో అర్జునుడిగా సర్ ప్రైజ్ చేశాడు. ఇక ఇప్పుడు 'స్పిరిట్'లో కూడా ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
అసలే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబో కావడంతో 'స్పిరిట్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఇందులో విజయ్ కూడా భాగమైతే.. 'కల్కి' సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మరోసారి బాక్సాఫీస్ షేక్ అవుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



