Dhurandhar 2: ఈ రూమర్ నిజమైతే ఆపడం ఎవరి తరం కాదు
on Jan 21, 2026

-ధురంధర్ 2 పై చక్కర్లు కొడుతున్న రూమర్
-ఆ రూమర్ నిజమయ్యే ఛాన్స్ ఉందా!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-ఆదిత్య దర్ మనసులో ఏముంది
ధురంధర్(Dhurandhar).. ఏ ముహూర్తాన దర్శకుడు ఆదిత్య దర్ (Aditya Dhar)ధురంధర్ సబ్జెట్ ని అనుకున్నాడో గాని రేపు ఇరవై నాలగవ తారీకుకి యాభై రోజులు పూర్తి చేసుకుంటున్నా సినిమా తాలూకు ప్రకంపనలు మాత్రం ఆగడం లేదు. నార్త్ లోనే కాదు ఇండియా మొత్తం ఇదే పరిస్థితి. ముఖ్యంగా నార్త్ హీరోలు, మేకర్స్ సరైన సినిమాలు చెయ్యడం లేదని చాలా కాలం నుంచి వస్తున్న విమర్శలకి కూడా ధురంధర్ చెక్ పెట్టినట్లయింది. దీంతో ఇప్పుడు ధురంధర్ పార్ట్ 2 కోసం ఇండియన్ సినీ అభిమానులతో పాటు వరల్డ్ లో ఉన్న ఇండియన్ మూవీ లవర్స్ రిలీజ్ డేట్ మార్చి 19 కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అంచనాలని మరింత పెంచేలా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. మరి ఆ రూమర్ వెనక ఉన్న కథ ఏంటో చూద్దాం.
ఉరి.. 2019 లో ఆదిత్య ధర్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఘన విజయాన్ని అందుకోగా ప్రతి భారతీయుడి మనసులో సదరు చిత్రం చిరస్థాయిగా నిలిచింది. 2016 వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్‌లోని 'ఉరి'(Uri)లో భారత సైనిక స్థావరంపై పాకిస్థాన్ సైన్యం దొంగచాటుగా ఉగ్రవాద దాడి చెయ్యడంతో 19 మంది భారత సైనికులు వీరమరణం పొందుతారు. ప్రతీకారంగా మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ నేతృత్వంలో భారత సైన్యంలోని పారా స్పెషల్ ఫోర్సెస్ పాకిస్తాన్‌లోని PoK (ప్రాక్సీ ఆపరేషన్)సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తుంది. ఈ లైన్ ఆధారంగా ఉరి తెరకెక్కగాషెర్గిల్ గా విక్కీ కౌశల్ పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. చావా వచ్చిన వరకు విక్కీ కౌశల్ ని షెర్గిల్ అని అభిమానులు, ప్రేక్షకులు పిలుస్తుండేవాళ్లు. అంత అత్యద్భుతంగా మెస్మరైజ్ చేసాడు.
ఇప్పుడు ధురంధర్ పార్ట్ 2 లో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ రోల్ లోనే విక్కీ కౌశల్(Vicky Kaushal)క్యామియో రోల్ లో కనిపించబోతున్నాడనే రూమర్ బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ రూమర్ పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తూ ఆ రూమర్ నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాపై ద్వేషం పెంచుకొని ఇండియాని తీవ్రవాద దాడులతో నాశనం చేయాలనేది ధురంధర్ 2 కథ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పార్ట్ 1 తోనే ఈ విషయం అర్ధమవుతుంది. దీంతో హంజా అలీ మజారి గా పాకిస్థాన్ లో ఉన్న ఇండియన్ రా ఆఫీసర్ జస్కిరత్ సింగ్(రణవీర్ సింగ్) కి హెల్ప్ చెయ్యడానికి షెర్గిల్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే నార్త్ లో ధురంధర్ 2 ని ఆపడం అసాధ్యం. హిట్ రేంజ్ ఊహకి కూడా అందదనే కామెంట్స్ చేస్తున్నారు. ఇక ధురంధర్ 1300 కోట్ల రూపాయిల పైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



