Mana shankara varaprasad garu: రికార్డుల విషయంపై చిరంజీవి భావోద్వేగ ట్వీట్
on Jan 20, 2026

-వాళ్ళు మాత్రమే ముఖ్యం
-చిరంజీవి ట్వీట్ లో ఏముంది
-అభిమానులు, ప్రేక్షకుల స్పందన ఏంటి
రికార్డులకి జస్ట్ గ్యాప్ వచ్చింది అంతే.. రికార్డులు కొట్టడం స్టార్ట్ చేస్తే మాములుగా ఉండదని మన శంకర వర ప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)ద్వారా మరోసారి చిరంజీవి(Chiranjeevi)నిరూపించాడు. పైగా ఎంటైర్ నాలుగున్నర దశాబ్దాల చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు అత్యంత ఫాస్ట్ గా 300 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి తెలుగు సినిమాగా కూడా మన శంకర వరప్రసాద్ నిలిచింది.దీన్ని బట్టి అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా మన శంకర వరప్రసాద్ కి బ్రహ్మరధం పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చిరంజీవి వారందరికీ కృతజ్ఞతలు చెప్తు చేసిన ట్వీట్ ఇప్పుడు తెలుగు సినీ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు అభిమానులకి, చిరంజీవి కి మధ్య ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో తెలియచేసింది. ఆ ట్వీట్ లో ఏముందో చూద్దాం.
నేను ఎప్పుడు చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం అభిమానులు, ప్రేక్షకుల ప్రేమకి ప్రతిరూపమని చెబుతూనే ఉంటాను. మన శంకర వర ప్రసాద్ గారు ద్వారా మళ్ళీ అది నిజమని నిరూపించారు. మీరు లేనిదే నేను లేను.థియేటర్లలో మీరు వేసే విజిల్స్ నే నాకు ప్రాణం. రికార్డులు వస్తాయి, పోతాయి. కానీ మీ ప్రేమ మాత్రం శాశ్వతం. అద్భుతమైన విజయాన్ని చూసి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ రికార్డు తెలుగుప్రేక్షకులది, డిస్ట్రిబ్యూటర్లది, దశాబ్దాలుగా నా వెంట నిలిచిన అభిమానులది.
Also read: రేణూ దేశాయ్ వెనకడుగు వేస్తుందా! అమ్మ, నాన్న, భర్త, అన్న ఏం చేస్తున్నారు
అలాగే ఈ బ్లాక్‌బస్టర్ విజయం దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)నిర్మాతలు సాహు, సుస్మిత తో పాటు మొత్తం టీమ్ చేసిన కృషికి నిదర్శనం. నాపై మీరు చూపించిన నమ్మకానికి ఇది అంకితం. వేడుకలు కొనసాగిద్దాం. లవ్ యూ ఆల్ అంటూ ట్వీట్ చేయడం జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



