ENGLISH | TELUGU  

సినిమా విడుద‌ల‌కు ఐదు వారాల ముందే వ‌స్తోన్న 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌!

on Nov 29, 2021

 

య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ 'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 3న మ‌న‌ముందుకు రానున్న‌ది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న ఈ సినిమా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేలాది థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతున్న విష‌యం తెలిసిందే. అంటే సినిమా విడుద‌ల‌కు 5 వారాల ముందుగానే ట్రైల‌ర్‌ను రాజ‌మౌళి టీమ్ తీసుకువ‌స్తోంది. దీంతో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ ఎగ్జ‌యిట్ ఫీల‌వుతున్నారు. డిసెంబ‌ర్ 3న ట్రైల‌ర్ విడుద‌ల‌వుతున్న విష‌యాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా వెల్ల‌డించింది.

ట్రైల‌ర్ రిలీజ్ పోస్ట‌ర్‌ను షేర్ చేసిన డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, "Get ready for the BIGGEST BLAST… TRAILER out on December 3rd. Don’t keep calm, let the celebrations begin!" అని ట్వీట్ చేసింది. ఇదే పోస్ట‌ర్‌ను షేర్ చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌, "Brace yourself for a massive blast... #RRRMovie trailer out on December 3rd." అని రాసుకొచ్చాడు. అలాగే రామ్‌చ‌ర‌ణ్‌, "Get ready to witness the magnificence of #RRRMovie. Trailer out on December 3rd…" అని ట్వీట్ చేశాడు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్‌, సాంగ్స్ 'ఆర్ఆర్ఆర్‌'పై హైప్‌ను విప‌రీతంగా పెంచేశాయి. ఇటీవ‌లే రిలీజ్ చేసిన 'జ‌న‌ని' సాంగ్ ఎమోష‌న‌ల్‌గా సాగి అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. తెలుగు, హిందీ భాష‌ల‌తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల‌తో పాటు ప‌లు విదేశీ భాష‌ల్లోనూ ఈ మూవీ విడుద‌ల‌వుతోంది. దేశ‌వ్యాప్తంగానే కాకుండా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ కోసం సినీ ప్రియులు అమితాస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Also read:  వాట్ ఎ విజువ‌ల్ వండ‌ర్‌.. 'ఆర్ఆర్ఆర్' గ్లిమ్స్‌!

అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, ఒలీవియా మోరిస్‌, శ్రియ‌, స‌ముద్ర‌ఖ‌ని, అలీస‌న్ డూడీ, రే స్టీవెన్స‌న్ కీల‌క పాత్ర‌ధారులైన ఈ సినిమాకు ఎం.ఎం. కీర‌వాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ స‌మ‌కూర్చ‌గా, బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు రాశారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.