ఆగష్టు 23న మసాలా పాటలు
on Aug 19, 2013
వెంకటేష్, రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "మసాలా". విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్, సురేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంజలి, షాజన్ పదాంసీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఆగష్టు 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు, త్వరలోనే ఈ చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.