బిగ్ సర్ ప్రైజ్.. విశ్వక్ సేన్ మూవీలో వెంకీ మామ
on Sep 21, 2022

వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడంలో విక్టరీ వెంకటేష్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య వంటి హీరోలతో తెరను పంచుకున్న వెంకీ మామ.. ఇప్పుడు మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీలో సందడి చేయబోతున్నాడు.
విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓరి దేవుడా!'. తమిళ్ రొమాంటిక్ ఫాంటసీ ఫిల్మ్ 'ఓ మై కడవులే'కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఒరిజినల్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తునే ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ్ లో విజయ్ సేతుపతి పోషించిన ప్రత్యేక పాత్రలో తెలుగులో వెంకటేష్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అందులో సూట్, కళ్ళద్దాలతో వెంకటేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన మోడరన్ గెటప్ లో ఉన్న దేవుడిలా కనిపించనున్నాడు. గతంలో వెంకటేష్ ప్రధాన పాత్ర పోషించిన 'గోపాల గోపాల'లో పవన్ కళ్యాణ్ దేవుడిలా కనిపించగా.. ఇప్పుడు విశ్వక్ సేన్ మూవీలో వెంకటేష్ దేవుడిలా కనిపించనుండటం విశేషం.

పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ తదితరులు నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా విదు అయ్యన్న, ఎడిటర్ గా విజయ్ ముక్తవరపు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



