తొమ్మిదేళ్ల తర్వాత మెగాఫోన్ పడుతున్న విజయ్ భాస్కర్!
on Sep 21, 2022

'స్వయంవరం', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కె.విజయ్ భాస్కర్ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
విజయ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న 13వ చిత్రమిది. 2013లో వచ్చిన 'మసాలా' మూవీ అనంతరం విరామం తీసుకున్న ఆయన ఏకంగా తొమ్మిదేళ్ల తర్వాత మెగా ఫోన్ పడుతుండటం విశేషం. ఈ చిత్రానికి సంబధించిన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లోని మణికొండలో ఘనంగా జరిగింది. విజయ భాస్కర్, జీవిత రాజశేఖర్, కార్తికేయ నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్, పారిశ్రామికవేత్త, నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ ఈ వేడుకకు హాజరై నిర్మాతకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ.. రాబోవు విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమౌతుందని, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఆ రోజు వెల్లడిస్తామని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



