అనంతపురంలో 'వీరసింహారెడ్డి'!
on Nov 8, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి అనంతపురం జిల్లాలో జరగనుంది.
రేపటి నుంచి ఐదు రోజుల పాటు అనంతపురం జిల్లాలో 'వీరసింహారెడ్డి' సినిమా కీలక సన్నివేశాల షూటింగ్ జరగనుంది. నవంబర్ 9న అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి గుడి దగ్గర, నవంబర్ 10, 11 తేదీల్లో అమిద్యాల, రాకెట్ల, ఉరవకొండ ప్రాంతాలలో, నవంబర్ 12, 13 తేదీల్లో పెనుగొండ ఫోర్ట్ దగ్గర 'వీరసింహారెడ్డి' చిత్రం షూటింగ్ జరుపుకోనుంది.
మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



