ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పూజా హెగ్డే.. ఫొటో వైరల్!
on Nov 8, 2022

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. తన ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ కు అప్‌డేట్ ఇచ్చారు పూజా హెగ్డే.సల్మాన్ ఖాన్ హీరోగా కిసీకా భాయ్ కిసీకీ జాన్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు పూజా హెగ్డే. ఆమె ఎడమ కాలుకు కాస్త గట్టిగానే గాయమైంది. అప్పటి నుంచి షూటింగులకు దూరంగా ఉంటున్నారు బుట్టబొమ్మ.
లేటెస్ట్ గా తన కాలుకున్న స్ప్లింట్‌ని తీసేశారు. సోఫాలో కూర్చుని తన కాలును బకెట్‌లో పెట్టి, ఫొటోకు ఫోజు ఇచ్చి షేర్ చేశారు. "కాలుకు గాయమైనప్పటి నుంచీ నా ఉదయం ఇలాగే ఉంటోంది" అంటూ క్యాప్షన్ పెట్టారు. "నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు" అని కవిగారు ఏ ముహూర్తాన రాశారోగానీ, "మీ కాళ్లకు దిష్టి తగిలింది మేడమ్" అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్‌గా చెలరేగి పోతారనుకున్న పూజాహెగ్డే ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. ఆమె నటించిన 'ఆచార్య', 'బీస్ట్' ఫ్లాప్ అయ్యాయి.
ఇప్పుడు ఆశలన్నీ సల్మాన్ 'కిసి కా భాయ్, కిసీ కీ జాన్' మీదే పెట్టుకున్నారు. పూజా హెగ్డే లేకపోవడంతో సల్మాన్ సినిమాలో మిగిలిన ఆర్టిస్టులతో సీన్లు తీసేస్తున్నారు. త్వరలోనే త్రివిక్రమ్, మహేష్ సెట్స్ కి కూడా వెళ్లాల్సి ఉంది పూజా. మరి కాల్షీట్ ఎలా అడ్జస్ట్ చేస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



