అఖిల్ తో వరుణ్ తేజ్ మల్టీస్టారర్
on Apr 17, 2017

వరుణ్ తేజ్ వైవిధ్యమైన సినిమాలు చేసే ప్రయత్నంలో కెరీర్ కి హిట్స్ అనేవి ఎంత ముఖ్యం అనే విషయం దాదాపు మర్చిపోయినట్టున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ తనకి మొదటి కమర్షియల్ హిట్ ఇస్తుంది అని చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ, కథలో విషయం లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకి మిస్టర్ సినిమా భారీగా నష్టాలు చేకుర్చొచ్చని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ప్రస్తుతం, శేఖర్ కమ్ములతో ఫిదా చేస్తున్న వరుణ్, కనీసం ఈ సినిమా అయినా బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు.
ఈ మధ్య తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మల్టీస్టారర్ చేస్తే మెగా ఫ్యామిలీ లో కాకుండా ఎవరితో చేస్తారు అని అడిగిన ప్రశ్నకు, ఏ మాత్రం ఆలోచించకుండా అఖిల్ తో చేస్తానని చెప్పాడు. అఖిల్ తనకి చిన్నప్పటి నుండి మంచి మిత్రుడు అని, మల్టీస్టారర్ చేస్తే తనకి అతనే బెస్ట్ పార్టనర్ అవుతాడని చెప్పాడు. వరుణ్ దే కాదు అఖిల్ కెరీర్ కూడా ఇబ్బందుల్లోనే ఉంది. మొదటి సినిమా అఖిల్ అడ్రస్ లేకుండా గల్లంతవడంతో తన రెండవ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్న అఖిల్ రెండవ సినిమా ఈ మధ్యే లాంచ్ అయ్యింది. చూద్దాం, వరుణ్, అఖిల్ మల్టీస్టారర్ ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



