సురేందర్ రెడ్డి పిల్లలకి చరణ్ ఏమిచ్చాడో తెలిస్తే షాక్ అవుతారు!
on Apr 17, 2017

డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి మెగా ఫ్యామిలీ తో మంచి సంబంధాలున్నాయి. అల్లు అర్జున్ కి రేస్ గుర్రం, రామ్ చరణ్ కి ధ్రువ రూపంలో హిట్లు ఇచ్చిన సూరి, తన తదుపరి చిత్రం గా మెగాస్టార్ చిరంజీవితో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రేపల్లె అనే సినిమా చేస్తున్న చరణ్, షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కి వచ్చారు. ఈ సందర్భంగా సూరి ని కలిసి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చిత్ర పనులు ఎంతవరకు వచ్చాయి అని వాకబు చేసారు. అంతేనా, సదరు దర్శకుడి పిల్లలకి మంచి బహుమతులు కూడా ఇచ్చారు. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కాబట్టి, చరణ్ వాళ్ళకి చిన్న గుర్రం పిల్లని గిఫ్ట్ గా ఇచ్చాడు.

బుజ్జి గుర్రం భలే ముద్దొస్తుంది కదూ. చరణ్ కి గుర్రాలు అంటే మక్కువ ఎక్కువ అన్న విషయం మనకు తెలిసిందే, తన ఫామ్ హౌస్ లో ఎప్పుడూ లెక్కలేనన్ని గుర్రాలు ఉంటాయి. ఈ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా, సురేందర్ రెడ్డి తనకు ఎంత స్పెషలో చరణ్ చెప్పకనే చెప్పారు. ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. త్వరలో సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ సినిమా, చిరంజీవికి డ్రీం ప్రాజెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



