బాహుబలి గురించి 5 తెలియని విషయాలు
on Apr 17, 2017

మొదట ఒకే భాగంగా తీద్దాం అనుకున్నా, కొన్ని కారణాల దృష్ట్యా రాజమౌళి బాహుబలి ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. లెన్త్ ఒక కారణం అయితే, బడ్జెట్ అసలు మరియు ప్రధాన కారణం. బాహుబలి గురించి 5 ముఖ్యమైన మరియు తెలియని విషయాలు మీకోసం.
1. బాహుబలి మొదటి భాగంలో తీసిన ప్రభాస్ వాటర్ ఫాల్ ఎక్కే సన్నివేశం తీయడానికి అతి ఎక్కువ సమయం పట్టింది. దాదాపు, ఈ ఒక్క సీన్ తీయడానికి రాజమౌళికి నెలరోజుల పైనే పట్టింది. ఇలాంటి సన్నివేశాలు, పార్ట్ 2 లో విరివిగా ఉంటాయంట.
2. ప్రతి ఆర్టిస్ట్ వేషధారణ విషయంలో అమితమైన శ్రద్ధ తీసుకున్నారు. బొట్టు విషయం దగ్గరి నుండి వేసుకునే దుస్తుల వరకు ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మార్క్ ఉండేలా చూసుకున్నారు. రమా రాజమౌళి, ప్రశాంతి తో కలిసి చాలా డిజైన్ లు పరిశీలించి, తర్వాత ఆర్టిస్టులతో టెస్ట్ చేయించి ఓకే చేశారట.
3. ప్రభాస్, రానా బాహుబలి కోసం చెరి 30 కిలోలు పెరిగారు. ప్రభాస్ అయితే ఏకంగా సొంతంగా ఒక జిమ్ సెట్ అప్ చేసుకొని రోజుకి కొన్ని గంటలు శ్రమ పడేవాడట. ఈ స్పెషల్ జిమ్ కోసం 1.50 కోట్లు ఖర్చు పెట్టాడట. ప్రభాస్ రోజుకి 40 గుడ్లు, ప్రోటీన్ పొడి కలిపి తాగే వాడంటే ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
4.బాహుబలి 2 లో కొన్ని సన్నివేశాల్లో అనుష్క గర్భవతిగా కనిపించనుంది. అనుష్క పార్ట్ మొదటి భాగంతో పాటే తీయడం వల్ల, పార్ట్ 2 కోసం ఎక్కువ రోజులు వెచ్చించాల్సిన అవసరం రాలేదు. ఒక రకంగా ఒళ్ళు పెంచేసిన అనుష్క పార్ట్ 2 ట్రైలర్ లో అందంగా కనిపించడానికి ఇదే ప్రధాన కారణం.
5. తెలుగు నటుడు సుబ్బరాజ్ బాహుబలి చావుకి ప్రధాన కారణం అవుతాడు. కట్టప్పే స్వయంగా చంపినా, సుబ్బరాజ్ ది కీలక పాత్ర అని తెలిసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



