శ్రీదేవి మేనకోడలు, శివాజీ గణేశన్ మనవడు కలిసిన వేళ!
on Dec 10, 2021

దివంగత నటి, భరతనాట్యం కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో 'యదలో మౌనం'. ఆస్కార్ పురస్కారాల్లో 'లైఫ్ యాక్షన్ షార్ట్' కేటగిరీలో పోటీ పడుతున్న 'వెన్ ద మ్యూజిక్ చేంజెస్' తర్వాత లక్ష్మీ దేవి దర్శకత్వంలో ఈ మ్యూజిక్ వీడియో రూపొందింది. ఇందులో లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ మనవడు దర్శన్, అతిలోకసుందరి శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా కనిపించనున్నారు.
Also Read: 'లక్ష్య' మూవీ రివ్యూ
శివాజీ గణేశన్, పద్మిని సుమారు 50 చిత్రాల్లో జంటగా నటించారు. ఇప్పుడు పద్మిని మనవరాలి దర్శకత్వంలో శివాజీ గణేశన్ మనవడు ఓ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం. కొత్త సంగీత దర్శకుడు వరుణ్ మీనన్‌తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి స్వరపరిచిన బాణీతో ఈ మ్యూజిక్ వీడియో రూపొందుతోంది. ఈ పాటను అచ్చు రాజమణి ఆలపించారు.
Also Read: బాలీవుడ్ లో సమంత హవా మొదలైంది.. 'రాజీ'కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్!
అభినందన్ రామానుజం ఈ మ్యూజిక్ వీడియోకు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సాంగ్ కి ఆంటోనీ గొంజాల్వెజ్ ఎడిటర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



