వారీసు... తునివు ఓటీటీలకు భారీ డీల్!
on Jan 12, 2023

కోలీవుడ్ స్టార్ అజిత్ విజయ్ లు నటించిన తునివు, వారీసు చిత్రాలు తాజాగా తమిళనాట విడుదలయ్యాయి. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ రెండు చిత్రాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కాగా అజిత్ నటించిన తునివు చిత్రం తెలుగులో తెగింపుగా విడుదలై బిలో యావరేజ్ టాక్ ను సాధించింది. ఈ చిత్రం తమిళ తంబీలకు నచ్చవచ్చేమో గాని తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఏమాత్రం నచ్చడం లేదు. వారంతా ఈ చిత్రం యాక్షన్ సీన్స్, అజిత్ సీన్స్ మరి అతిగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇక విజయ్ నటించిన వారీసు చిత్రం కూడా కోలీవుడ్లో యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది.
ఈ చిత్రం వారసుడిగా తెలుగులో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కూడా యావరేజ్ గానే తెలుగులో టాక్ ను సొంతం చేసుకోవడం ఖాయమని అంతకుమించి అతిగా ఊహించుకోవడం అనవసరమని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం గతంలో విడుదలైన పలు తెలుగు చిత్రాలను పోలి ఉందని ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తలపతి విజయ్ నటించిన వారిసు, తల అజిత్ నటించిన తునివు చిత్రాల ఓటిటి డీల్స్ కూడా ఖరారు అయ్యాయి. వారిసూ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకోగా తునివు హకులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
ఈ రెండు చిత్రాలు భారీ ధర పలికాయని సమాచారం. ఈ రెండు చిత్రాలు దియేటికల్ రిలీజ్ లో అయిన తర్వాత కొన్ని వారాల వ్యవధిలో అగ్రిమెంట్ ప్రకారం ఓటీటీలో విడుదల కానున్నాయి. మొత్తానికి తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు పోటీలో ఉండడంతో తెగింపు, వారసుడు చిత్రాలు తెలుగులో నామమాత్రంగా మిగిలిపోతాయని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



