మంత్రి రోజాపై ‘మెగా’పంచ్!
on Jan 12, 2023

మెగాస్టార్ చిరంజీవి.... ఈయన పేరుకు మెగాస్టారే గాని సినిమాల్లో తప్పితే బయట జీవితంలో చాలా సున్నితంగా ఉంటారు. ఈయన ఎవరిపై అతిగా విమర్శలు చేయరు. ఎవరైనా ఈయనపై అతిగా విమర్శలు చేసినా కూడా సున్నితంగా స్పందిస్తారే గానీ అగ్రేసివ్‌గా ఉండరు. అది ఆయన పెద్దరికం... ఆయన గొప్పతనానికి నిదర్శనం. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య లో నటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని సమాచారం. కానీ ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ కు భిన్నంగా ఆయన వ్యవహార శైలి ఉంటుందనేది అతిశయోక్తి కాదు. ఇటీవల ఆయనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కేవలం మెగాస్టార్ పై విమర్శలు చేస్తే ఈజీగా పబ్లిసిటీ బాగా లభించి మరింత సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గంగా ప్రత్యర్థులు భావిస్తున్నారు.
ఇటీవల ఏపీ మంత్రి ఒకప్పుడు హీరోయిన్ అయినా రోజా మాట్లాడుతూ సినీ నటులు చాలా సెన్సిటివ్. వెరీ ఎమోషనల్ గా ఉంటారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు దిగ్గజ నటులు. ప్రజల నుంచి అపారమైన గౌరవాన్ని అందుకున్నారు. కానీ చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబులకు ఎలాంటి ఎమోషన్స్ లేవు. అందుకే ఈ ముగ్గురు అన్నదమ్ములను నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు అని తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగబాబు రోజాకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తనదైన శైలిలో రోజాపై పంచ్ వేశారు.
ప్రస్తుతం వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న మెగాస్టార్ రోజా వ్యాఖ్యలపై మాట్లాడుతూ ఇన్ని రోజులు నాతో స్నేహంగా ఉండి.. నా సహాయం తీసుకుని.... నా సహాయం కోసం నా ఇంటికి వచ్చిన వారు కూడా నేను ఎటువంటి సహాయం చేయలేదంటున్నారు. నేను ఎవరికి సహాయం చేశానో నాకు తెలుసు... నా సహాయం తీసుకున్న వారికి ఆ విషయం తెలుసు. నా గురించి తెలిసి మాట్లాడారో లేక తెలియక మాట్లాడారో కానీ అలాంటి వారిని నేను కేర్ చేయను. నా పేరు వాడకపోతే వారికి మనుగడ ఉండదనే వారు నా గురించి మాట్లాడుతున్నారు... అంటూ మెగా పంచ్ విసిరారు. మొత్తానికి చిరు విషయంలో పంచ్ రోజాకు సూటిగానే తగులుతుందని భావించాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



