కరోనా బారిన పడిన జయమ్మ
on Jul 17, 2022

కొంతకాలంగా మళ్ళీ భారత్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. 'క్రాక్' సినిమాతో 'జయమ్మ'గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తాజాగా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపింది.
తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన వరలక్ష్మి.. జాగ్రత్తగా ఉండాలని తన తోటి నటీనటులకు సూచించింది. "తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకింది. మొత్తం సిబ్బంది మాస్క్ ధరించాలని నటీనటులు పట్టుబట్టడం ప్రారంభించండి. ఎందుకంటే నటులుగా మనం మాస్క్ ధరించలేం. రీసెంట్ నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. కరోనా ఇంకా ఉంది. అందరూ మాస్క్ లు ధరించి, జాగ్రత్తగా ఉండండి" అని వరలక్ష్మి ట్వీట్ చేసింది.

వరలక్ష్మి చేతిలో ప్రస్తుతం పలు తెలుగు, తమిళ సినిమాలు ఉన్నాయి. 'NBK 107', 'యశోద', 'హను మాన్' వంటి సినిమాల్లో వరలక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



