ఆగష్టు 1 నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్!
on Jul 17, 2022

ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రేక్షకులు థియేటర్స్ కు పెద్దగా రాకపోవడంతో ఒకట్రెండు తప్ప మెజారిటీ సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగులుతున్నాయి. ఇలాంటి తరుణంలో నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 1 నుంచి షూటింగ్స్ నిలిపివేయనున్నారని సమాచారం.
వేతనాలు పెంచాలంటూ ఇటీవల సినీ కార్మికులు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అసలే అధికంగా పెరిగిన నిర్మాణ వ్యయానికి, ఇది అదనపు భారమన్న ఆందోళన నిర్మాతల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే నిర్మాణ వ్యయం తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారట. అప్పుడు తమపై భారం తగ్గడంతో పాటు, కార్మికులకు వేతనాలు పెంచొచ్చని భావిస్తున్నారట. అలాగే ఓటీటీల కారణంగా థియేటర్స్ లో సినిమాలకు ఆదరణ లభించట్లేదని, అందుకే థియేటర్స్ లో విడుదలైన పది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నారట.
నిర్మాణ వ్యయం, ఓటీటీలు, కార్మిక వేతనాలు మరియు ఇతర సమస్యలపై చర్చించి స్పష్టత వచ్చేవరకు షూటింగ్స్ నిలిపే వేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట. ఆగష్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ కానున్నాయని, సమస్యలు పరిస్కారమయ్యాకే మళ్ళీ షూటింగ్స్ ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



