'మాచర్ల'లో కృతి శెట్టి లుక్ అదిరింది
on Jul 17, 2022

వరుస సినిమాలతో దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. రీసెంట్ గా విజిల్ మహాలక్ష్మిగా 'ది వారియర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కృతి.. త్వరలో 'మాచర్ల నియోజకవర్గం' మూవీతో స్వాతిగా అలరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి కృతి ఫస్ట్ లుక్ విడుదలైంది.
నితిన్,కృతి శెట్టి జంటగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో స్వాతి అనే పాత్రలో కృతి నటిస్తోంది. తాజాగా కృతి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. యెల్లో డ్రెస్ లో చేతిలో కాఫీ కప్ పట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని ఉన్న కృతి స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.

కేథరిన్ థ్రెసా, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ఆగష్టు 12న విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



